Donald Trump: కరోనా కట్టడిలో మేం సఫలమవుతున్నాం: ట్రంప్

Trump said their government has been succeeding against corona
  • మెరుగైన నివారణ చర్యలు తీసుకుంటున్నామన్న ట్రంప్
  • రిపబ్లికన్ పార్టీలో సంతృప్తి వ్యక్తమైందని వెల్లడి
  • ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం అంటూ ట్వీట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 24.9 లక్షలు కాగా, ఒక్క అమెరికాలోనే 7.99 లక్షల కేసులు నమోదయ్యాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అగ్రరాజ్యంలో 42,897 మరణాలు సంభవించాయి. అయితే కొన్నిరోజులుగా పరిస్థితి అదుపులోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

దీనిపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. "కరోనా మహమ్మారిని నియంత్రించడంలో మేం మరింత మెరుగయ్యామనే భావిస్తున్నాం. అమెరికాలో కరోనా వ్యాప్తి నివారణ, సహాయ చర్యలపై రిపబ్లికన్ పార్టీలో 96 శాతం సంతృప్తి వ్యక్తమైంది. మా ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం" అని పేర్కొన్నారు.
Donald Trump
Corona Virus
USA
Republican Party
COVID-19

More Telugu News