సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Samantha to act in one more remake film
  • మరో రీమేక్ లో సమంత?
  • రవితేజకి హీరోయిన్ల ఖరారు
  • రూమర్ ని ఖండించిన గోపీచంద్    
 *  ఇప్పటికే 'యూ టర్న్', 'ఓ బేబీ', 'జాను' వంటి రీమేక్ చిత్రాలలో నటించిన అందాలతార సమంత త్వరలో మరో రీమేక్ లో నటించే అవకాశం కనిపిస్తోంది. కన్నడ హిట్ చిత్రం 'దియా'ను తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కూడా కథానాయిక పాత్రకు సమంత పేరే ప్రముఖంగా వినిపిస్తోంది.
*  ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేసే రవితేజ సరసన ఇప్పటికే నిధి అగర్వాల్ ఓ నాయికగా ఎంపికైంది. మరో కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేశారు.
*  శివ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తీ' చిత్రంలో తాను విలన్ గా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని యాక్షన్ హీరో గోపీచంద్ పేర్కొన్నాడు. ఈ రూమర్స్ ఎలా పుట్టాయో తనకి తెలియదని, అసలు ఆ ఆలోచనే తనకి రాలేదని గోపీచంద్ తెలిపాడు.
Go Back to Shorts
Samantha
Raviteja
Nidhi Agarwal
Rajanikanth
Gopichand

More Telugu News