Amitabh Bachchan: మీరు ఎప్పుడు ప్రధాని అవుతారు? అన్న ప్రశ్నకు అమితాబ్‌ బచ్చన్ సమాధానం!

Amitabh Bachchan Was Asked If He Wants To Become Prime Minister
షార్ట్స్‌లో చూడండి
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ అప్పుడప్పుడు తన ఫాలోవర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను బ్లాగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఓ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని 'సర్.. మీరు దేశానికి ప్రధానమంత్రి ఎప్పుడు అవుతారు?' అంటూ అడిగారు. దీనికి అమితాబ్‌ స్పందిస్తూ... 'అరె యార్‌... ఉదయాన్నే పవిత్రమైన విషయాలు మాట్లాడొచ్చు కదా' అంటూ చమత్కారంగా సమాధానమిచ్చారు.  

కాగా, అమితాబ్‌ బచ్చన్‌ 1980ల్లో రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 1984లో అలహాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, మూడేళ్ల తర్వాత రాజీనామా చేశారు. అమితాబ్‌ బచ్చన్‌ ఈ వయసులోనూ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏ భారతీయ నటుడుకీ లేనంత మంది ఫాలోవర్లు ఆయనకు ఉన్నారు.
Go Back to Shorts
Amitabh Bachchan

More Telugu News