'భీష్మ' హిందీ రీమేక్ లో అర్జున్ కపూర్
- హిందీలోకి రీమేక్ అవుతున్న తెలుగు సినిమాలు
- ఆ జాబితాలో చేరిన నితిన్ 'భీష్మ'
- రణబీర్ కపూర్ కి బదులుగా అర్జున్ కపూర్
నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' ఇక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రణబీర్ కపూర్ హీరోగా హిందీలో నిర్మించడానికి కరణ్ జొహార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రణబీర్ కపూర్ కి వరుస కమిట్మెంట్లు ఉండటంతో, అర్జున్ కపూర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రీమేక్ ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.