పారాసిటమాల్​ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

Ban lifts on paracetamol exports
  • ‘కరోనా’ నేపథ్యంలో ఎగుమతులపై ఇటీవలే నిషేధం విధింపు
  • ఆంక్షలు తొలగించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ 
  • ఈ మేరకు డీజీఎఫ్ టీ ప్రకటన
దేశంలో ‘కరోనా’ మహమ్మారి నేపథ్యంలో పారాసిటమాల్ ఫార్ములేషన్స్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అనుబంధ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. పారాసిటమాల్ ఫార్ములేషన్స్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్టు పేర్కొంది. కాగా, ‘కరోనా’ నేపథ్యంలో దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉండాలన్న ఉద్దేశంతో ఇటీవలే వాటి ఎగుమతులపై నిషేధం విధించింది.
 
 

Go Back to Shorts
paracetamal
formulations
ban lift

More Telugu News