Kerala: 20 తరువాత నిబంధనల సడలింపు: కేరళలో సరి బేసి విధానంలో వాహనాలకు అనుమతి

  • రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్ లు
  • సరి బేసి విధానంలో వాహనాలకు అనుమతి
  • కేంద్రాన్ని కోరిన పినరయి విజయన్
Odd Even Vehicle permissions in kerala After 20


ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తామని, వాహనాల రాకపోకల విషయంలో 'సరి - బేసి' విధానాన్ని అమలు చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.

నిబంధనల సడలింపు పాక్షికంగానే ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, మహిళలు నడిపే వాహనాలకు మాత్రం ఏ రోజైనా అనుమతినిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జిల్లాలను నాలుగు జోన్ లుగా విభజించి, లాక్ డౌన్ ను అమలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్టు పినరయి వెల్లడించారు.

కాగా, కేరళలో గురువారం సాయంత్రానికి 394 కేసులు ఉండగా, 147 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 245 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారు.

More Telugu News