West Godavari District: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి సజీవ దహనం

Two dead in Road accident in west godavar
  • స్పిరిట్ లోడుతో గుంటూరు నుంచి వెళ్తున్న వ్యాన్
  • అలంపురం జాతీయ రహదారిపై అదుపు తప్పి చెట్టును ఢీకొన్న వ్యాన్
  • క్షణాల్లోనే అంటుకున్న మంటలు

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. గుంటూరు నుంచి తణుకు వైపు స్పిరిట్ లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. పెంటపాడు మండల పరిధిలోని అలంపురం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

చెట్టును వ్యాను ఢీకొట్టడంతో క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. వ్యానులో ఉన్నది స్పిరిట్ కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్, క్లీనర్ తప్పించుకునే వీల్లేకుండా పోయింది. దీంతో వారు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News