Prabhas: త్వరలో ఖరారు కానున్న ప్రభాస్ సినిమా టైటిల్

Radhakrishna Kumar Movie
  • ప్రభాస్ నుంచి మరో భారీ చిత్రం
  • ఇంతవరకూ ఖరారు కాని టైటిల్
  •  పరిశీలనలో 'జాన్' .. 'ఓ  డియర్' .. 'రాధేశ్యామ్'
ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ వారు .. గోపీకృష్ణ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమే అయింది.

'జాన్' .. 'ఓ  డియర్' .. 'రాధేశ్యామ్' టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. దాంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని గ్రహించిన ప్రభాస్, త్వరలో టైటిల్ ను ఖరారు చేసి ప్రకటించేయమని దర్శక నిర్మాతలకు చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ అభిమానులను కూల్ చేయుటం కోసం, దర్శక నిర్మాతలు అదే పనిలో వున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే కనిపించనున్న సంగతి తెలిసిందే.
Prabhas
Pooja Hegde
UV Creations

More Telugu News