మురికివాడలోని కుటుంబాలను దత్తత తీసుకున్నాం: సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్
- లాక్ డౌన్ కారణంగా పేదలకు అండగా నిలవాలనుకున్నాం
- గుర్గావ్ లో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాం
- రెండు పూటలా ఆహారపదార్థాలు అందజేస్తున్నాం
తన తండ్రి పర్యవేక్షణలో వారికి రెండు పూటలా ఆహారపదార్థాలు అందజేస్తున్నామని చెప్పింది. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ పేదలకు ఆహారం అందిస్తున్నామని తెలిపింది. ‘కరోనా’ బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే సూచించిన జాగ్రత్తలను ప్రజలు పాటించాలని కోరింది.