శ్రీకాళహస్తిలో పెరుగుతున్న కరోనా కేసులు

Two more corona cases in Srikalahasti
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిలో కొత్తగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఇద్దరూ గతంలో క్వారంటైన్ లో ఉన్నవారేనని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ మూడు కేసులు నమోదయ్యాయి.

 ఈ ముగ్గురిలో ఒకరు లండన్ నుంచి వచ్చిన వ్యక్తి కాగా... మరో ఇద్దరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త మాట్లాడుతూ, కరోనా ఏ వయసు వారికైనా సోకుతుందని ప్రజలను హెచ్చరించారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని క్వారంటైన్ లో ఉంచుతున్నామని చెప్పారు. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన ఇద్దరూ కూడా గతంలో క్వారంటైన్ లో ఉన్నవారేనని తెలిపారు.
Go Back to Shorts
Srikalahasti
Corona Virus

More Telugu News