Karnataka: గ్రామ దేవత ఆదేశించిందట... ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన ప్రజలు!

Village Goddess Orders to Vacate
షార్ట్స్‌లో చూడండి
కరోనా మహమ్మారి నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలంటే, మూడు రోజుల పాటు ఎవరూ గ్రామంలో ఉండరాదని, ప్రతి ఒక్కరూ ఇంటి వైపు కూడా చూడకూడదని గ్రామదేవత చెప్పిందంటూ, కర్ణాటకలోని ఓ గ్రామమంతా ఖాళీచేసి వెళ్లిపోయింది. ఈ ఘటన తుమకూరు జిల్లా ముద్దనహళ్లిలో చోటు చేసుకుంది. ఆ గ్రామ దేవత మారమ్మదేవి, ఓ మహిళకు పూని భవిష్యవాణి చెబుతూ ఉంటుంది. తాజాగా, ఈ భవిష్యవాణిలో కరోనా ప్రమాదం పొంచివుందని చెప్పింది. దీన్ని నమ్మిన ఊరి ప్రజలు, గ్రామానికి వెళ్లే దారిని మూసివేసి, ఊరి చివరి పొలాల్లో చిన్న చిన్న డేరాలు వేసుకుని, వాటిల్లో ఉంటున్నారు. తమతమ పశువులను కూడా అక్కడికి తరలించడంతో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది.
Go Back to Shorts
Karnataka
Maramma Talli
Bhavishya Vani
Corona Virus

More Telugu News