మహేశ్ బాబు ట్వీట్ పై తెలంగాణ డీజీపీ ప్రతిస్పందన!

09-04-2020 Thu 14:28
  • క్లిష్ట సమయంలో పోలీసులు నిస్వార్థంగా పని చేస్తున్నారన్న మహేశ్
  • ఇలాంటి వ్యాఖ్యలు తమ నిబద్ధతను పెంచుతాయన్న డీజీపీ
  • ఒక ప్రశంస, ఒక చిరునవ్వు చాలంటూ వ్యాఖ్య
Telangana DGP response on Mahesh Babu tweet

లాక్ డౌన్ సమయంలో దేశం కోసం, ప్రజల కోసం తెలంగాణ పోలీసులు నిస్వార్థంగా పని చేస్తున్నారంటూ సినీ హీరో మహేశ్ బాబు ప్రశంసించిన సంగతి తెలిసిందే. మహేశ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో మీరు చేసిన వ్యాఖ్యలు పోలీసుల నిబద్ధతను మరింత బలపరుస్తాయని అన్నారు. సమాజ సేవలో భాగం కావడం తమకు గర్వంగా ఉందని చెప్పారు. సమస్యల్లో ఉన్న వారిని రక్షించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వారికి ఒక ప్రశంస, ఒక చిరునవ్వు చాలని అన్నారు.


లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని స్టార్ హీరో మహేశ్ బాబు ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా కితాబిచ్చాడు. కరోనాపై యుద్ధంలో వారు చేస్తున్న సేవలను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో మన కుటుంబాల సంరక్షణ కోసం వారు ఎంతో పాటుపడుతున్నారని... దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు అన్నారు. ఈ వ్యాఖ్యలపై డీజీపీ ప్రతిస్పందించారు.