Chandrababu: చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో వీడియో కాన్ఫరెన్స్

Chandrababu conducts TDP Politi Bureau meeting
  • హైదరాబాద్ లోని బాబు నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్
  • ‘కరోనా’ ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై చర్చ
  • ఏపీలో పరిస్థితిపైనా సమీక్ష

ఈ రోజు ఏపీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దీనిని నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించినట్టు సమాచారం. అదే విధంగా రాష్ట్రంలో పరిస్థితి, ప్రభుత్వ సన్నద్ధతపైనా, ధాన్యం, ఉద్యాన, ఆక్వా రైతుల సమస్యలపైనా సమీక్షించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News