నా దూరదృష్టిని మీరు గుర్తించారు... కృతజ్ఞతలు: వైఎస్ జగన్ కు చంద్రబాబునాయుడు లేఖ
- నాడు విశాఖలో మెడ్ టెక్ జోన్ పెట్టాం
- నేడు అక్కడ వైద్య పరికరాలు తయారవుతున్నాయి
- దేశానికే గర్వకారణంగా నిలిచిందన్న చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ 10 నెలల్లో మెడ్ టెక్ జోన్ ను నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసుంటే, మెరుగైన ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందుండేవని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల వారికి నెలకు రూ. 5 వేలు ప్రభుత్వ సాయం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో 'అన్న క్యాంటీన్'లను నిలిపివేశారని, వాటిని తెరిపించి, పేదలకు అన్నం పెట్టాలని, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వమే రైతుల పంటను కొనుగోలు చేయాలని సూచించారు.