షాక్ లో బాలీవుడ్.. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లకు కరోనా పాజిటివ్.. ఇప్పుడు తండ్రికి కూడా!

08-04-2020 Wed 18:14
  • నిర్మాత కరీమ్ మొరానీకి కరోనా పాజిటివ్
  • ఇప్పటికే చికిత్స పొందుతున్న షాజా, జోయా
  • క్వారంటైన్ లో మిగిలిన కుటుంబ సభ్యులు
Bollywood producer Karim Morani tests Corona positive

బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కూతుళ్లు షాజా మొరానీ, జోయా మొరానీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిలో షాజా ముంబైలోని నానావతి ఆసుపత్రిలోను... జోయా కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు.

ఇప్పుడు కరీమ్ మొరానీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను కూడా నానావతి ఆసుత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ లో ఉంచారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా బారిన పడటంతో బాలీవుడ్ షాక్ కు గురైంది. మరోవైపు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కు కరీమ్ మొరానీ అత్యంత సన్నిహితుడు. షారుఖ్ తో ఆయన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రాన్ని నిర్మించారు.