GST: కరోనాతో అల్లాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు.. జీఎస్టీ పరిహారం నిధుల విడుదల

Union Govt ready to release GST compensation funds
  • నాలుగు నెలల తర్వాత తొలిసారి తగ్గిన జీఎస్టీ వసూళ్లు
  • రూ.14,103 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం
  • జీఎస్టీ వసూళ్లపై కరోనా పంజా
కరోనా వైరస్ కారణంగా నిధుల లేమితో అల్లాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తోపాటు పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది.

అక్టోబరు, నవంబరు నెలలకు గాను నిన్న రూ.14,103 కోట్లను కేంద్రం విడుదల చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందే తొలి విడత నిధులు రూ. 19,950 కోట్లను విడుదల చేసింది. అంటే మొత్తంగా రూ. 34,053 కోట్లను విడుదల చేసింది. డిసెంబరు, జనవరి నెలల నిధులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం.

మరోవైపు, జీఎస్టీ వసూళ్లపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. అంతకుముందు వరుసగా నాలుగు నెలలపాటు లక్ష కోట్లకుపైనే జీఎస్టీ వసూలైంది. అయితే, మార్చిలో ఇది రూ.97,597 కోట్లకు పడిపోయింది. జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటకపోవడం నాలుగు నెలల తర్వాత ఇదే తొలిసారి.
GST
Corona Virus
states

More Telugu News