వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

08-04-2020 Wed 14:55
  • స్థానిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వైసీపీ నేతల యత్నం
  • నగదు, నిత్యావసరాలను వైసీపీ నేతలతో పంపిణీ చేయిస్తున్నారు
  • దీనిపై చర్యలు చేపట్టాలని ఎస్ఈసీకి చంద్రబాబు విజ్ఞప్తి
Chandrababu Naidu writes a letter to SEC

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ  ఫిర్యాదు చేశారు.

నగదు, నిత్యావసరాలను పార్టీ నేతలతో పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి 250కి పైగా వీడియో, ఫొటోల ఆధారాలను ఆ లేఖకు జతచేసి చంద్రబాబు పంపారు. దీనిపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా బాధ్యతగా వ్యవహరించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. కాగా, ‘కరోనా’ నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.