కరోనా ఉద్ధృతి తీవ్రం... జపాన్ లో అత్యయిక పరిస్థితి విధించేందుకు సిద్ధమైన ప్రధాని
- జపాన్ లోనూ 3,500 కరోనా కేసులు
- 85 మంది మృతి
- జాగ్రత్త పడాల్సిన దశ ఇదేనంటున్న మేధావులు
- షింజో అబే ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిళ్లు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతరం కావడంతో షింజో అబే ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ప్రజల భద్రత కోసం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనా వంటి దేశాలతో పోల్చితే జపాన్ లో కరోనా ప్రభావం తక్కువే అయినా, ఆయా దేశాల పరిస్థితి చూసిన తర్వాత ఎమర్జెన్సీ విధించడమే మంచిదని జపాన్ లోని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కరోనా ఉనికి వెల్లడయ్యాక జపాన్ లో ఇప్పటివరకు 3,500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 85 మంది మరణించారు.