ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్

05-04-2020 Sun 16:01
  • కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
  • ప్రతి ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
  • జిల్లాకొక కరోనా టెస్టింగ్ ల్యాబ్ ఉండాలని స్పష్టీకరణ
CM Jagan reviews over corona situations in state

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఆసుపత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని, సంబంధిత లక్షణాలతో వచ్చినవారి పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఢిల్లీ జమాత్ కు వెళ్లొచ్చినవాళ్లు, వారు కలిసిన వ్యక్తులకు త్వరగా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలు పాటించేలా చూడాలని తెలిపారు.