Mahinder Reddy: తెలంగాణలో వైద్యులపై దాడులకు పాల్పడితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం: డీజీపీ మహేందర్ రెడ్డి

Telangana DGP Mahender Reddy Warns who attacks on Doctors
  • ‘కరోనా’ బాధితులకు వైద్య సేవలందించే వారిపై దాడులు చేస్తే సహించం
  • వైద్యులు, సిబ్బంది భద్రతకు మరిన్ని చర్యలు చేపట్టాం
  • పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశాం
కరోనా వైరస్ బారిన పడ్డ వారికి వైద్య సేవలందిస్తున్న వారిపై దాడుల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన  విడుదల చేశారు. వైద్యులు, ఇతర అధికారులు, సర్వే సిబ్బందికి భద్రత నిమిత్తం మరిన్ని చర్యలు చేపట్టామని, మండలాల వారీగా, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్పారు.

హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు, వైద్యులు, జీహెచ్ ఎంసీ అధికారులతో పోలీస్ -మెడికల్ వాట్సప్ గ్రూప్ , ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్లతో మెడికల్ నోడల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశామని వివరించారు. వైద్యులు, ఆయా శాఖల సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
Mahinder Reddy
TS DGP
Corona Virus
Doctors
Security

More Telugu News