కరోనా భయంతో ఆదిలాబాద్‌లో గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిన ప్రజలు

05-04-2020 Sun 14:00
  • మధురా నగర్‌ ప్రజల్లో భయాందోళనలు 
  • 100 నుంచి 150 కుటుంబాలు తమ ప్రాంతాన్ని వదలిన వైనం
  • తాత్కాలికంగా తమ పంటపొలాల్లో షెడ్లు వేసుకొని జీవనం
  • నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్‌ జిల్లాలో పదిమందికి కరోనా 
coronavirus cases telangana adilabad

కరోనా విజృభణ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లాలోని మధురా నగర్‌ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మధురా నగర్‌ చుట్టుపక్కల నివాసం ఉండే 100 నుంచి 150 కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాత్కాలికంగా తమ పంటపొలాల్లో షెడ్లు వేసుకొని ఉంటున్నారు. నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్‌ జిల్లాలో పదిమందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో తమ గ్రామాల్లోని ఇతరులకు కూడా కరోనా సోకుతుందన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. నేరడికొండ మండల కేంద్రంలో ఒక్కరోజే ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. వారిని వైద్య సిబ్బంది క్వారైంటన్‌కు తరలించారు. కరోనా పాజిటివ్‌ అని తేలిన వ్యక్తులు ఇంతకు ముందు పది రోజులుగా నేరేడుకొండలో వివిధ ప్రాంతాల్లో తిరిగారు. ఈ నేపథ్యంలోనే ఆ మండలంలోని మధురా నగర్‌ ప్రజలు గ్రామం వదిలి పంట పొలాలకు వెళ్లి ఉంటున్నారు.