Bandi Sanjay: అసదుద్దీన్ ఒవైసీపై నిప్పులు చెరిగిన బండి సంజయ్!

Telangana BJP President Bandi Sanjay lashes out Assadudding Owaisi
  • దీపాలు వెలిగించాలన్న మోదీ పిలుపును అవహేళన చేస్తారా?
  • ‘నీకు సిగ్గుందా? జ్ఞానం ఉందా?’
  • తొమ్మిది గంటలకు చార్మినార్ ఎక్కి చూడు, భారతీయుల దీపాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక పోరాటానికి  జాతి యావత్తూ ఏకతాటిపై నిలిచిందనడానికి సంకేతంగా  ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది నిమిషాల పాటు ప్రతి పౌరుడు తమ ఇంట్లో దీపాన్ని వెలిగించాలని భారత ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ పిలుపును అవహేళన చేసే విధంగా అసదుద్దీన్ మాట్లాడతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీపం పెట్టమంటే హేళన చేస్తావా? ‘నీకు సిగ్గుందా? జ్ఞానం ఉందా?’ అంటూ అసదుద్దీన్ పై విరుచుకుపడ్డారు. రాత్రి తొమ్మిది గంటలకు చార్మినార్ ఎక్కి చూడు, భారతీయుల దీపాలు ఎలా ఉన్నాయో తెలుస్తుందంటూ అసదుద్దీన్ కు  సూచించారు.
Bandi Sanjay
BJP
Telangana
Assaduddin owaisi
MIM

More Telugu News