Nara Lokesh: ‘కరోనా’ని జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో చూడండంటూ నారా లోకేశ్ ఓ వీడియో పోస్ట్

Nara Lokesh criticises CM Jagan
  • ‘కరోనా’ కు అంతగా భయపడాల్సిన పని లేదంటారా!
  • ఏపీలో ’కరోనా’  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి
  • ‘ప్యానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదంటారన్న జగన్ పై విమర్శలు
కరోనా వైరస్ కు అంతగా భయపడాల్సిన పని లేదన్న సీఎం జగన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ను జత చేస్తూ జగన్ పై విమర్శలు చేశారు. ఏపీలో ‘కరోనా’ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘ఇప్పటి వరకు, ‘కరోనా’ని జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో చూడండి’ అంటూ ఓ వీడియోను జత చేశారు. ‘కరోనా’ ఏదో భయానక వైరస్ అని చెబుతున్నారని, ‘ప్యానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ విమర్శలు చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
cm
Andhra Pradesh

More Telugu News