'రౌద్రం రణం రుధిరం' తదుపరి షెడ్యూల్ కి అలియా భట్

04-04-2020 Sat 14:09
  • 400 కోట్ల బడ్జెట్ తో 'ఆర్ ఆర్ ఆర్'
  • చరణ్ - అలియా సాంగ్ చిత్రీకరణ
  • జనవరిలో ప్రేక్షకుల ముందుకు
RRR Movie

ఇటు ఎన్టీఆర్ .. అటు చరణ్ అభిమానులంతా కూడా 'రౌద్రం రణం రుధిరం' సినిమాపైనే దృష్టిపెట్టారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆమె తప్పుకుందనే టాక్ వచ్చింది. అందులో నిజం లేదంటూ ఈ సినిమా యూనిట్ స్పష్టం చేసింది.

మే నెలలో మొదలయ్యే తదుపరి షెడ్యూల్లో అలియా భట్ పాల్గొనన్నట్టు చెప్పింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగును పూణేలో ప్లాన్ చేశారు. చరణ్ - అలియా భట్ కాంబినేషన్లో ఒక పాటను అక్కడ చిత్రీకరించనున్నారట. అలాగే ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా అక్కడ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.