Corona Virus: ఈ నెల చివరి నాటికి భారత్‌లో కరోనా తీవ్రతరం: ఇండియన్ చెస్ట్ సొసైటీ
- మనకి మరో నెల సమయం ఉంది
- పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తే తీవ్రతను తగ్గించుకోవచ్చు
- లాక్‌డౌన్ చర్యలు తప్పకుండా కరోనా వ్యాప్తిని తగ్గిస్తాయి
ఈ నెల చివరినాటికి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఇండియన్ చెస్ట్ సొసైటీ తెలిపింది. 'మనకి మరో నెల సమయం ఉంది. ఏప్రిల్ చివరి నాటికి లేక మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ్చు' అని ఇండియన్ చెస్ట్ సొసైటీ చీఫ్ క్రిస్టోఫర్ తెలిపారు.
లాక్‌డౌన్ చర్యలతో తప్పకుండా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని వివరించారు. కాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తీసుకుంటున్న చర్యలు, వైద్య సిబ్బంది రక్షణ వంటి అంశాలపై ఐసీఎస్ స్పందిస్తూ.. కరోనా ఐసోలేషన్ వార్డుల్లో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఏకధాటిగా 10 గంటల కన్నా అధిక సమయం పనిచేయడం ప్రమాదకరమని ప్రకటించింది.