Nirmal District: నిర్మల్‌ జిల్లాలో కలకలం.. సర్వేకు వచ్చిన ఆశా కార్యకర్తలపై గుంపులుగా దాడికి యత్నం

attck on asha workers
షార్ట్స్‌లో చూడండి
కరోనా విజృంభణ నేపథ్యంలో సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలపై తెలంగాణలో దాడులు జరుగుతుండడం కలకలం రేపుతున్నాయి. మొన్న నిజామాబాద్‌లో దాడులు జరిగాయి.. నిన్న ఆదిలాబాద్‌లో జరిగాయి. ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలపై దాడికి యత్నం జరిగింది. దీంతో ఆశా కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు.

ఈ రోజు ఉదయం వైఎస్సార్ కాలనీ, కబూతర్ కాలనీల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన ఆశా కార్యకర్తలపైకి అక్కడి ఓ వర్గం కుటుంబాలు కొన్ని గుంపులుగా దూసుకువచ్చాయి. దీంతో ప్రాణ భయంతో ఆశా కార్యకర్తలు అక్కడి నుంచి తప్పించుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ కుటుంబాలన్నీ కలిసి దాడిచేయడానికి వచ్చాయని, చంపేస్తామన్నారని వివరించారు.
Go Back to Shorts
Nirmal District
Corona Virus

More Telugu News