వరుణ్ తేజ్ సినిమా వచ్చేది అప్పుడే!

04-04-2020 Sat 11:19
  • బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్ 
  • పరిశీలనలో 'బాక్సర్' టైటిల్ 
  • జూలై 30న విడుదల చేసే ఛాన్స్
Kiran Korrapati Movie

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సిద్ధు - ముద్ద నిర్మాణంలో .. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. సహజత్వం కోసం ఆయన కొంతకాలం పాటు బాక్సింగులో శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. అందువలన ఈ సినిమాకి 'బాక్సర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ సినిమాలో ఒక కథానాయికగా సయీ మంజ్రేకర్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కీలకం కానుంది. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 2' .. 'గద్దలకొండ గణేశ్' భారీ విజయాలను సాధించాయి. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.