Lockdown: ఈ నెల 15 నుంచి దేశీయ విమాన సర్వీసుల ప్రారంభం!

 Domestic flights resume from the 15th of this month
  • బుకింగ్స్ ప్రారంభించిన పలు విమానయాన సంస్థలు!
  • 30వ తేదీ వరకు సేవలు నిలిపివేశామంటున్న ఎయిర్ ఇండియా
  • ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న సంస్థలు
లాక్‌డౌన్ కారణంగా  అత్యవససర సేవలు మినహా దేశంలో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. గూడ్స్, నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం మాత్రమే కొన్ని విమానాలు, రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ పూర్తి కావడం, దాన్ని పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారంతో దేశీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలు కానున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి సర్వీసులు పునరుద్ధరించాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే బుకింగ్స్‌ను కూడా  ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం ఈ నెల 30వ తేదీ వరకు తమ సర్వీసులను తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ మార్గాల్లో అప్పటిదాకా విమానాలు నడుపబోమని చెప్పింది. మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆంక్షలు సడలిస్తుందని, ఇందులో తమ సర్వీసులు కూడా ఉంటాయని భావిస్తున్నాయి.

ఇక లాక్‌డౌన్ కారణంగా గత నెల 24 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వాటిని యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి రెండు రోజుల కిందట ప్రకటించారు.
Lockdown
airlines
domestic
flights
resume
from
15th april

More Telugu News