Germany: కావాలని కరోనా వైరస్ ఎక్కించుకున్న జర్మనీ మేయర్!

Why A German Mayor Infected Himself With Coronavirus On Purpose
  • పార్ట్ నర్ నుంచి ఇన్ఫెక్ట్ అయిన బెర్లిన్ జిల్లా మేయర్
  • కరోనా వైరస్ చాలా వరస్ట్ అని వ్యాఖ్య
  • ప్రపంచం కోసమే ఈ పని చేశానన్న మేయర్
కరోనా వైరస్ తాను ఊహించిన దానికంటే చాలా 'వరస్ట్' అని జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫెన్ వాన్ డాస్సెల్ అన్నారు. తన పార్ట్ నర్ నుంచి తాను కావాలనే వైరస్ ను ఎక్కించుకున్నానని చెప్పారు. అయితే తాను ఊహించిన దాని కంటే అనారోగ్యం ఎక్కువ కాలం ఉందని తెలిపారు. వైరస్ ను ఎదుర్కొనే నిరోధక శక్తిని సాధించాలనే ఉద్దేశంతో ఇన్ఫెక్షన్ ను ఎక్కించుకున్నానని చెప్పారు. ఒక మూడు రోజుల పాటు అనారోగ్యంతో ఉంటానని, ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని సాధిస్తానని భావించానని తెలిపారు. అయితే తాను ఊహించిన దానికంటే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తన నుంచి వైరస్ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.

తన పార్టనర్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత  తాను కూడా 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్నానని... ఆమెకు సమీపంలో ఉన్నానని స్టీఫెన్ చెప్పారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఆ ఇన్ఫెక్షన్ సోకకుండా నిలువరించలేమని తెలిపారు. అయితే కావాలనే వైరస్ ను సోకించుకున్న స్టీఫెన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచం కోసమే తాను ఈ పని చేశానని  చెప్పారు. కరోనా విస్తరణను కట్టడి చేయడమే తన లక్ష్యమని అన్నారు. తాను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడిన తర్వాతే క్వారంటైన్ నుంచి బయటకు వస్తానని తెలిపారు.
Germany
Berlin
Mayor
Corona Virus

More Telugu News