sleep: అధిక సమయం పనిచేస్తున్నారా?.. ‘హైపో థైరాయిడిజం’ ముప్పు ఉంటుందంటున్న పరిశోధకులు

are you working extra hours
  • దక్షిణ కొరియాలోని నేషనల్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకుల వెల్లడి
  • వారానికి 53 నుంచి 83 గంటలు పనిచేసే వారికి ముప్పు
  • ఈ వ్యాధి దీర్ఘకాలం కొనసాగితే హృద్రోగాలతో పాటు మధుమేహం 
మీరు అధిక సమయం పనిచేస్తున్నారా?.. అయితే ‘హైపో థైరాయిడిజం’ ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియాలోని నేషనల్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు కొందరి పని వేళలపై  పరిశోధనలు జరిపారు. వారానికి 53 నుంచి 83 గంటలు పనిచేసే వారికి  ‘హైపో థైరాయిడిజం’ ముప్పు ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఈ వ్యాధి దీర్ఘకాలం కొనసాగితే  హృద్రోగాలతో పాటు మధుమేహానికి దారితీస్తుందని వారు చెప్పారు. పనివేళల గంటలు అధికంగా ఉండకుండా చూసుకోవాలని సూచించారు.  
sleep
health

More Telugu News