Yanamala: సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల తీవ్ర విమర్శలు

TDP Leader Yanamala lashes out CM Jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని మీడియా సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్ కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని, రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్, దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని, ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా జగన్ తీసుకోలేదని విమర్శించారు. మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా విలేకరులకు జగన్ ఇవ్వలేదని, ‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Go Back to Shorts
Yanamala
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
cm

More Telugu News