JEE: జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 2020 పరీక్షల వాయిదా

  • కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసిన ఎన్టీఏ
  • వచ్చే నెలాఖరులో పరీక్షలు జరిగే అవకాశం
  • 15వ తేదీన పరిస్థితిని సమీక్షించనున్న అధికారులు
JEE Main 2020 Postponed Till Last Week Of May

జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 2020 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే చివరి వారంలో పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. అప్పటి పరిస్థితిని బట్టి పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. పరీక్షలు వాయిదా పడటంతో... తదుపరి డేట్లను బట్టి ఏప్రిల్ 15 తర్వాత అడ్మిట్ కార్డులను ఇష్యూ చేయనున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి మాట్లాడుతూ, త్వరలోనే మనం సాధారణ స్థితికి వస్తామని భావిస్తున్నామని చెప్పారు. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను తెలియజేస్తామని చెప్పారు.

మరోవైపు నీట్ పరీక్షలను కూడా ఎన్టీఏ వాయిదా వేసింది. 15వ తేదీన పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఎన్టీఏ తదుపరి నిర్ణయాన్ని తీసుకోనుంది. పరీక్షల తేదీలు ఖరారైన తర్వాత www.nta.ac.in వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

More Telugu News