'నిద్ర'తో ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్‌ అయిపోయిన కుర్రాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నిద్ర'తో ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్‌ అయిపోయిన కుర్రాడు!

china youngster become popular
  • నిద్రపోతూ టిక్‌టాక్‌ లైవ్‌ ఆన్
  • గురక పెడుతున్నానా? అన్న విషయం తెలుసుకోవాలనుకున్న యువకుడు
  • అనుకోకుండా లక్షలాది మంది చూసిన వైనం
చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌కు చెందిన యువన్సన్‌ అనే యువకుడు ఇంట్లో నిద్రపోయి ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్‌ అయ్యాడు. నిద్రపోతే పాప్యులర్ అవడమేంటీ? అనుకుంటున్నారా? అతడు టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతడు టిక్‌టాక్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ పెట్టి పడుకున్నాడు. తాను నిద్రపోతున్నప్పుడు గురక పెడుతున్నానా? అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఆ రికార్డు చేశాడు.

అయితే, అతడు నిద్రపోతోన్న వీడియోను లక్షలాది మంది చూశారు. ఐదు గంటలు నిద్రపోయిన అనంతరం నిద్రలేచి చూసుకుని షాక్ అయ్యాడు. ఎన్నడూ లేనంతగా తన వీడియోను ఇన్ని లక్షల మంది చూడడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. దీంతో పలుసార్లు నిద్రపోతూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆన్‌ చేశాడు. వాటిని కూడా లక్షలాది మంది చూశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్‌ అయిపోయాడు. అతడి ఫాలోవర్ల సంఖ్య అమాంతం 10 లక్షలకు చేరింది. టిక్‌టాక్‌లో పాప్యులర్‌ స్టార్‌ అయిపోయాడు.
China
tiktok

More Telugu News