మే నెలకి వెళ్లిన 'ఉప్పెన'!
- రేపు విడుదల కావలసిన 'ఉప్పెన'
- కథానాయికగా కృతి శెట్టి పరిచయం
- మే మొదటివారంలో విడుదల
కరోనా పరిస్థితులు ఒక కొలిక్కి వస్తే, మే మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ అమ్మాయి స్టిల్స్ చూసే కుర్రాళ్లంతా మనసులను పారేసుకున్నారు. టీజర్ వదిలిన దగ్గర నుంచి సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు. విడుదలకి ముందే ఈ సుందరికి వరుస అవకాశాలు వస్తున్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్.