Nara Lokesh: ఒక్క సారి రైతు దెబ్బ తింటే కోలుకోవడం చాలా కష్టం: నారా లోకేశ్

lokesh fires on farmers
షార్ట్స్‌లో చూడండి
లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైతులను ఆదుకోవాలని టీడీపీ నేత నారా లోకేశ్ కోరారు. 'రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పండించిన పంటకి మద్దతు ధర రావడం లేదు. కనీసం వేరే ప్రాంతాలకు తరలించడానికి రవాణా సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు' అని ట్వీట్ చేశారు.
 
'హార్టి కల్చర్, ఆక్వా రంగంలో ఉన్న రైతుల కష్టాలు వర్ణనాతీతం. కూలీలు, గిట్టుబాటు ధర లేక వరి పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్క సారి రైతు దెబ్బ తింటే కోలుకోవడం చాలా కష్టం. వీలైనంత త్వరగా స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను' అని చెప్పారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Corona Virus

More Telugu News