తెలంగాణలో కరోనా మృతులు ఆరుగురు!
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా మృతులు ఆరుగురు!

Corona Death Toll Rises in Telangana to 8
  • అందరూ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే
  • ఎవరినైనా గుర్తిస్తే వైద్య విభాగానికి తెలియజేయండి
  • ఉచితంగా పరీక్షలు, చికిత్స చేయిస్తాం
  • ట్విట్టర్ లో వెల్లడించిన తెలంగాణ సీఎంఓ
తెలంగాణలో కరోనా మహమ్మారి ఇంతవరకూ ఆరుగురిని పొట్టన బెట్టకుంది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ ఆరుగురూ, న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారేనని స్పష్టం చేసింది.

"న్యూఢిల్లీలో మార్చి 13 నుంచి 15 వరకూ జరిగిన మర్కజ్ లో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చి, కరోనా వ్యాధి బారిన పడిన ఆరుగురు మరణించారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చనిపోగా, అపోలో హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్, నిజామాబాద్, గద్వాల్ ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు" అని సీఎంఓ పేర్కొంది.

ఆపై "కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ లు పని చేస్తున్నాయి. గుర్తించిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నాం. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ఆసుపత్రుల్లో రిపోర్ట్ చేయాలని తెలంగాణ వైద్య విభాగం విజ్ఞప్తి చేస్తోంది" అని ట్వీట్ చేసింది.

మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో ఎవరినైనా ప్రజలు గుర్తిస్తే, వెంటనే వైద్య విభాగానికి తెలియజేయాలని కోరింది. "మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తున్నది" అని కూడా తెలంగాణ సీఎంఓ ట్వీట్ పెట్టింది.
Telangana
Death Toll
Rises

More Telugu News