No que Now: సామాజిక దూరానికి ఉందో యాప్.. రూపొందించిన హైదరాబాద్‌ టెకీ!

Hyderabad techie designed app for social distance
  • ‘నో క్యూ నౌ’ అనే వెబ్ ఆధారిత యాప్‌కు రూపకల్పన
  • ముందుగానే టైం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం
  • హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో అందుబాటులోకి
కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించిన కేంద్రం నిత్యావసర సరుకుల కొనుగోలుకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. దీంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ఫలితంగా సామాజిక దూరం నిబంధన అటకెక్కిపోతోంది. దీంతో వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో, దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు హైదరాబాద్‌కు చెందిన టెకీ విజయానందరెడ్డి. సూపర్ మార్కెట్లు, ఇతర నిత్యావసర దుకాణాల్లో ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా ఆ సమయంలో వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకునేలా  ‘నో క్యూ నౌ’ (http://noqnow.com) అనే వెబ్ ఆధారిత యాప్‌ను రూపొందించాడు. నాలుగు రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటికే పలువురు వినియోగిస్తూ సామాజిక దూరం పాటిస్తున్నారు.

నో క్యూ నౌ యాప్‌లో మనం ఉంటున్న ప్రదేశం పేరును ఎంటర్ చేయగానే మన చుట్టూ ఉన్న సూపర్ మార్కెట్లు, బజార్లు, కూరగాయల దుకాణాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిలో మనకిష్టమైన స్టోర్‌ను ఎంచుకుని టైమ్ స్లాట్‌ను ఎంచుకుంటే వెంటనే మన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే యూనిక్ పాస్‌వర్డ్, క్యూఆర్ కోడ్ పంపుతారు. ఆ తర్వాత స్టోర్‌కు వెళ్లి ఆ క్యూఆర్ కోడ్‌ను చూపించి షాపింగ్ చేసుకోవచ్చు. మొబైల్ లేదంటే కంప్యూటర్ ద్వారా స్లాట్‌లు బుక్ చేసుకునే అవకాశం ఉన్న ఈ సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణెలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
No que Now
Hyderabad
Social Distance
Corona Virus

More Telugu News