ప్రత్యేక అంబులెన్స్ లను ప్రారంభించిన సీపీ సజ్జనార్

Cyberabad CP Sajjanar launches special ambulances
లాక్ డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్స్ లను పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రైవేట్ ఆసుపత్రుల వారి సౌజన్యంతో ఈ అంబులెన్స్ లు ప్రారంభించినట్లు తెలిపారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డయాలసిస్ పేషెంట్ల కోసం అంబులెన్స్ లను వినియోగిస్తున్నారని, డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్లేందుకు అనుమతి కోరిన రోగుల ఇళ్ల వద్దకు కానిస్టేబుళ్లు వెళ్లి పాసులు అందజేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్లు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను సూచించారు. గర్భిణిలు, వృద్ధులు, ఇతర అత్యవసరాల నిమిత్తం వెళ్ల దలచినవారు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు లేదా [email protected] ను సంప్రదించాలని సూచించారు.


Go Back to Shorts
Sajjanar
cyberabad
police commissioner
special ambulances

More Telugu News