తిరుమలలో ముగిసిన ధన్వంతరీ యాగం... మంత్రజలాన్ని రిజర్వాయర్ లో కలిపిన పూజారులు!
- ముగిసిన మూడు రోజుల మహాయాగం
- ఆకాశగంగ, పాపనాశనం జలాశయాల్లో మంత్రజలం
- రోజుకు 10 వేల మందికి ఆహారం సమకూర్చనున్న టీటీడీ
తిరుపతిలో ఆహారం అందుబాటులో లేక పలువురు పేదలు ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం తమకు అందిందని, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచనల మేరకు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఏప్రిల్ 14 వరకూ రోజుకు 10 వేల మందికి ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఓ సాంబార్ అన్నం ప్యాకెట్, ఓ పెరుగన్నం ప్యాకెట్ అందిస్తామని, అవసరమైతే 50 వేల ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.