Sajjanar: సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇంట్లో పాము.. చాకచక్యంగా పట్టేసిన కానిస్టేబుల్

  • పాము దూరిన సమయంలో ఇంట్లోనే ఉన్న కమిషనర్
  • వెంకటేశ్ అనే కానిస్టేబుల్ కి సమాచారమిచ్చిన సజ్జనార్
  • పామును ప్రాణాలతో పట్టుకున్న వెంకటేశ్
Snake enters in to Sajjanar Home

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇంట్లోకి ఓ పాము దూరింది. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే, పాముకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా... హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వెంకటేశ్ అనే కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న వెంకటేశ్... చాకచక్యంగా పామును ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పామును  జూపార్క్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్ ప్రతిభను మెచ్చుకున్న సజ్జనార్... ఆయనకు రివార్డును ప్రకటించారు.

More Telugu News