పార్టీలకు వెళ్లను.. నాకు ఎలాంటి అలవాట్లు లేవు!: మంచు విష్ణు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్టీలకు వెళ్లను.. నాకు ఎలాంటి అలవాట్లు లేవు!: మంచు విష్ణు

Vishnu
  • మందు కొట్టను.. సిగరెట్లు తాగను
  • మంచి స్నేహితులు వున్నారు 
  • సరదాగా గొడవపడుతుంటామన్న విష్ణు 
హీరోగా విష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ లపై ఎక్కువగా దృష్టిపెట్టే విష్ణు, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "సరదాగా గొడవ పడినా .. హత్తుకున్నా నాన్నగారికి .. చిరంజీవి గారికి .. కృష్ణంరాజుగారికి మధ్య మంచి రిలేషన్ షిప్ వుంది. అలాంటి స్నేహితులు దొరకడాన్ని నేను గొప్ప విషయంగా భావిస్తాను.

నేను పార్టీలకు వెళ్లను .. నాకు మందు కొట్టడం .. సిగరెట్ తాగడం వంటి అలవాట్లు లేవు. అయినా నాకు మంచి స్నేహితులు వున్నారు. ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటాము. సరదాగా గొడవ పడుతుంటాము. తెలుగులో కల్యాణ్ రామ్ .. ప్రభాస్ .. నితిన్ .. సుమంత్ .. గోపీచంద్ వీళ్లంతా నాకు మంచి స్నేహితులు. ఇక పెళ్లికి ముందు నా తల్లిదండ్రులను ప్రేమించినంతగా వేరెవరినీ ప్రేమించలేనని అనుకున్నాను. పెళ్లి తరువాత నా భార్యను కూడా అదేస్థాయిలో ప్రేమించగలనని అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.
Vishnu
TNR
Tollywood

More Telugu News