Chiranjeevi: మిత్రమా, మనలో మార్పు రావాలి.. మన లక్ష్మీ ప్రసన్న వీడియో చూడాలి: మోహన్ బాబుకు చిరంజీవి రిప్లై

chiranjeevi about corona
  • చిరుకి ట్విట్టర్‌లోకి స్వాగతమన్న మోహన్‌ బాబు
  • 'రాననుకున్నావా?.. రాలేననుకున్నావా?' అంటూ చిరు రిప్లై
  • 'ఈ సారి హగ్‌ చేసుకున్నప్పుడు చెబుతాను' అన్న మోహన్‌ బాబు
  • ఆలింగనాలు వద్దు.. కరచాలనాలు వద్దు.. నమస్తే మాత్రమేనన్న చిరు
మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ మోహన్‌ బాబు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి.. 'రాననుకున్నావా?.. రాలేననుకున్నావా?' అని రిప్లై ఇచ్చారు. దీంతో మోహన్‌ బాబు.. 'ఈ సారి హగ్‌ చేసుకున్నప్పుడు చెబుతాను' అంటూ సమాధానమిచ్చారు. 

దీనిపై ఈ రోజు స్పందించిన చిరంజీవి.. 'మిత్రమా ... కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. ఆలింగనాలు వద్దు.. కరచాలనాలు వద్దు.. నమస్తే మాత్రమే పెట్టుకోవాలి. సామాజిక దూరం తప్పనిసరి. దీనిపై మరింత అవగాహన పెంచుకోవడానికి, మనవారిని రక్షించుకోవడానికి మన లక్ష్మీ ప్రసన్న పోస్ట్ చేసిన వీడియో చూడండి' అని ట్వీట్ చేశారు.  

Chiranjeevi
Twitter
Mohan Babu
Tollywood
Corona Virus

More Telugu News