అలాంటి వాళ్లు నా దృష్టిలో దేశభక్తులు కాదు: విరాట్ కోహ్లీ
- లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై భారత కెప్టెన్ అసహనం
- ఇప్పటికైనా మేల్కొని బాధ్యతగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
- ప్రభుత్వ సూచనలు పాటించాలని హితవు
‘ఆటగాడిగా కాదు, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నా. కొన్ని రోజులుగా ప్రజల నిర్లక్ష్య వైఖరి చూస్తున్నా. లాక్‌డౌన్, కర్ఫ్యూ పట్టించుకోకుండా రోడ్లపై గుంపులుగా సంచరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కరోనా వైరస్‌ను మీరు తేలిగ్గా తీసుకున్నారని అనిపిస్తోంది. కానీ, మనం ఊహించినట్టుగా ఇది సాధారణమైనది కాదు. సరదా కోసం రోడ్లపైకి రాకండి. అలా చేసేవాళ్లు నా దృష్టిలో దేశ భక్తులు కాదు. దయచేసి సామాజిక దూరాన్ని పాటించండి. ప్రభుత్వ సూచనలు పాటించండి. ఈ దేశానికి మీ మద్దతు, సహాయం అవసరం’ అని కోహ్లీ విజ్ఞప్తి చేశాడు.