Ganababu: విశాఖలో కరోనా కేసులపై.. సీఎస్ కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు

TDP MLA Ganababu writes letter to AP CS Neelam Sahni
  • విశాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి
  • వెంటనే కరోనా టెస్టింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేయాలి
  • కరెంట్ బిల్లులు, ఇంటి పన్ను రద్దు చేయండి
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్నీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గణబాబు లేఖ రాశారు. విశాఖలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని... వెంటనే నగరంలో కరోనా టెస్టింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేయాలని లేఖలో విన్నవించారు. రాష్ట్రంలో 50 వేల సైంటిఫిక్ టెస్టింగ్ కిట్ల అవసరం ఉందని చెప్పారు. బాడీ ప్రొటెక్షన్ సూట్స్, ఎన్-95 మాస్కుల కొరత తీవ్రంగా ఉందని  తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఆదాయం వచ్చే అవకాశం లేదని... ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు కరెంట్ బిల్లులు, మూడు నెలల పాటు జీవీఎంసీ ఇంటి పన్నును రద్దు చేయాలని కోరారు.
Ganababu
Telugudesam
Andhra Pradesh
CS
Neelam Sahni
Corona Virus
Vizag

More Telugu News