Narendra Modi: దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకే ఆర్బీఐ భారీ చర్యలు తీసుకుంది: ప్రధాని మోదీ

PM Modi appreciates RBI latest decision

  • కరోనా నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన
  • ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రశంసించిన ప్రధాని
  • మధ్యతరగతి ప్రజలు, వ్యాపార వర్గాలకు ఊతమిచ్చే నిర్ణయమని కితాబు

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకే ఆర్బీఐ ఇవాళ భారీ చర్యలు తీసుకుందని తెలిపారు. ఆర్బీఐ తాజా ప్రకటన వల్ల ద్రవ్య లభ్యత పెరగడమే కాకుండా, నిధులపై వ్యయం తగ్గుతుందని, తద్వారా మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారవర్గాలకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News