Sukmar: ‘కరోనా’పై పోరాటానికి విరాళం ప్రకటించిన దర్శకుడు సుకుమార్

Director Sukmar announces donation to two telugu states
  • ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విరాళంగా రూ.10 లక్షలు
  • కరోనా మహమ్మారిని అరికట్టే నిమిత్తం ఈ విరాళం ఇస్తున్నా
  • టాలీవుడ్ దర్శకుడు సుకుమార్
కరోనా వైరస్ కట్టడికి గాను టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు విరాళాల రూపంలో తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రెండు తెలుగు రాష్ట్రాలకు తన విరాళాలను ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విరాళంగా రూ.10 లక్షలు ప్రకటించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ‘కరోనా’ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు పోరాడే నిమిత్తం ఈ విరాళాలు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 
Sukmar
Director
Corona Virus
Donation
Andhra Pradesh
Telangana

More Telugu News