మూడు నెలల రుణ చెల్లింపుల వాయిదా ప్రయోజనం కొద్దిమందికే... ఆర్బీఐ వివరణ!
- క్రెడిట్ కార్డులపై రుణాలు చెల్లించాల్సిందే
- విద్య, వ్యక్తిగత, గృహ రుణాలపైనే మారటోరియం
- ఉసూరుమన్న క్రెడిట్ కార్డు దారులు
వాస్తవానికి రుణాలపై కిస్తీలను మూడు నెలల పాటు చెల్లించకుంటే, సదరు ఖాతాను నిరర్ధక ఆస్తిగా బ్యాంకు పరిగణిస్తుంది. కానీ, ఈ మూడు నెలలూ వాయిదాలు చెల్లించకున్నా, వాటిని ఎన్పీఏలుగా ప్రకటించ వద్దని ఆదేశించింది.
ఇక, కొద్దిసేపటి క్రితం మారటోరియంపై వివరణ ఇచ్చిన రిజర్వ్ బ్యాంకు, క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని పేర్కొంది. ఆ చెల్లింపులను నిబంధనల ప్రకారమే వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. టర్మ్ లోన్స్ లో భాగంగా ఉండే... అంటే, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు వంటి వాటికి మాత్రమే ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ ప్రకటనతో క్రెడిట్ కార్డుదారులు ఉసూరుమన్నారు.