వికారాబాద్ జిల్లాలో.. గ్రామసర్పంచ్ అపర్ణ ఆత్మహత్య!
- తిమ్మాయిపల్లి సర్పంచ్ గా గెలిచిన అపర్ణ
- ప్రజల సమస్యలు తీరుస్తూ మన్ననలు
- పురుగుల మందు తాగి బలవన్మరణం
స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం, బుధవారం అర్థరాత్రి అపర్ణ పురుగుల ముందు తాగింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచారు. అపర్ణ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె మృతిపట్ల గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.