Sachin Tendulkar: సురేశ్ రైనాకు సచిన్ శుభాకాంక్షలు

  • రెండోసారి తండ్రి అయిన సురేశ్ రైనా
  • రైనా దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన సచిన్
  • ఈ ప్రపంచంలోకి రియో రైనాకు స్వాగతం అంటూ పోస్ట్
Sachin Tendulker congrats Suresh Raina

టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా, ప్రియాంక దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైనా దంపతులకు టీమిండియా క్రికెటర్లు సహా పలువురు సెలబ్రిటీలు తమ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. రియో రైనాకు స్వాగతం పలుకుతున్నానని, దేవుడి ఆశీర్వాదంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కాంక్షిస్తూ సచిన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా, సురేశ్ రైనా దంపతులకు నిన్న మగబిడ్డ జన్మించాడు. ఆ చిన్నారికి ‘రియో రైనా’ గా నామకరణం చేశారు.

More Telugu News