Narendra Modi: పత్రికాధిపతులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న రామోజీరావు, రాధాకృష్ణ

Ramojirao and ABN Radhakrishna attended meeting with Modi
షార్ట్స్‌లో చూడండి
మన దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పత్రికాధిపతులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు.

ఈ సమావేశానికి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ, మీడియా పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా మీడియా పని చేయాలని అన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Media Heads
Conference
Ramoji Rao
Eenadu
Radhakrishna
Andhrajyothy

More Telugu News